prudhvi filed complaint against geetha govindham matrimony on Jul 8, 2021
గౌరవనీయులైన ఫోరం జడ్జి గారికి వ్రాయు విన్నపం ఏమనగా ,
నా పేరు పామిశెట్టి పృథ్వీరాజ్ , నా తండ్రి పేరు పామిశెట్టి రామ కేశవులు ,నా వయసు ** సంవత్సరాలు,నేను *-*- *** డోర్ నందు పులివెందుల లో నివాసం ఉంటున్నాను. నేను అవివాహితుడను. నేను వివాహం కొరకు నా ప్రొఫైల్ ను, నా ఫోన్ నెంబర్ను తెలుగు మ్యాట్రిమోనీ ,తొగట మ్యాట్రిమోనీ సైట్లలో పెట్టడం జరిగినది , అందులో నుంచి నా ఫోన్ నెంబర్ ను గీతాగోవిందం మ్యాట్రిమోనీ (తిరుపతి) వాళ్ళు తీసుకుని వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. వాళ్లు నన్ను అట్రాక్ట్ చేయడం కొరకు నాకు *, * ఫోటోలు మంచివి పంపించారు. ఆ ఫోటో లోని వ్యక్తులు వాళ్ళందరూ నా ప్రొఫైల్ చూసి ఇష్టపడ్డారు , మీరు డబ్బులు కడితే వారితో సంప్రదింపులు చేయిస్తాము, ఫోన్ నెంబర్లు ఇస్తాము,పెళ్లిచూపులు అరేంజ్ చేస్తాము అని చెప్పారు. మీరు డబ్బులు కట్టకపోతే మంచి అవకాశాన్ని మీరు కోల్పోతారు అని నన్ను ప్రెజర్ చేశారు. అప్పుడు నేను ఆలోచించుకొని నేను డబ్బులు వేస్తాను అందుకు మీరు ఏ విధంగా నాకు సర్వీస్ చేస్తారు, అని నేను వాళ్లను ప్రశ్నించాను. అందుకు వాళ్లు సమాధానముగా * నెలలలో ** ప్రొఫైల్స్ మీకు చూపించడం జరుగుతుంది అని చెప్పారు. అప్పుడు నేను వెంటనే ఒకవేళ చూపించలేకపోతే అని వాళ్ళను ప్రశ్నించాను ? అప్పుడు వాళ్ళు ఆరు నెలలు కాకపోతే సంవత్సరం అయినా పర్లేదు మేం మీకు ** ప్రొఫైల్స్ కంపల్సరిగా చూపిస్తామని, అవి పూర్తయ్యేంతవరకు సర్వీసు చేస్తామని నాకు వాగ్దానం చేశారు. అప్పుడు నేను వాళ్ళు చెప్పిన కండిషన్స్ కు ఓకే అనుకొని నేను **** సెప్టెంబర్ ** వ తేదీన **,*** వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా గీతాగోవిందం మ్యాట్రిమోనీ వాళ్లకు వేయడం జరిగినది. నేను డబ్బులు వేసిన అనంతరం వాళ్ళు నాకు చుక్కలు చూపించడం ప్రారంభించారు. వారు మొదటగా చూపించిన ఐదు ప్రొఫైల్స్ అన్నీ ఫేక్ అని తెలిసినది. నేను వాళ్ళను గట్టిగా నిలదీశాను. తర్వాత వాళ్లు వారానికి మూడు ఫోటోలు చొప్పున నాకు (*-*/*) ఒకటిన్నర నెల సర్వీస్ చేశారు. ఆ ఒకటిన్నర నెలలో వాళ్లు పంపిన మొత్తం ప్రొఫైల్స్ **. ఆ పద్దెనిమిది కూడా సరైనవి పంపక, నన్ను మోసం చేశారు. ఆ వెంటనే నేను మళ్ళీ వాళ్ళను నిలదీశాను, ఇంక వాళ్ళు నా ఫోన్ కు రెస్పాన్స్ సరిగా ఇవ్వకుండా, మీకు సర్వీస్ చేసే మేడంకు కరోనా వచ్చింది , ఇంకో మేడం రావడం లేదు అని రకరకాల కారణాలు చెప్పి నన్ను ఏడిపించారు ,మానసికంగా వేధించారు. ఆరు నెలలు సమయం అయిపోయింది అంతవరకు వేచి చూసి ఆ తర్వాత మీ సర్వీస్ అయిపోయింది ,మేము సర్వీస్ చేయలేమని చెప్పి మోసం చేశారు. అంతేకాక * నెలల సమయం వృధా చేశారు, దాంతో నేను మానసికంగా చాలా వేదనకు గురయ్యాను. కావున వారిని ఈ కోర్టుకు పిలిపించి తగు విచారణ జరిపి, నేను డబ్బు కట్టినప్పుడు నుంచి చెందిన మానసిక వేదనకు నష్టపరిహారంగా లక్ష రూపాయలు ఇప్పించి నాకు తగు న్యాయం జరపవలసిందిగా ప్రార్థించుచున్నాను.
ఇట్లు
తమ భవదీయుడు
పామిశెట్టి పృథ్వీరాజ్
**********.
I am very pleased with Voxya. They helped me resolve my issue without much hassle. Very impressed and satisfied.
- Preeti Anandan
My two years of blood & sweat got valued finally with Voxya. I got a full refund with no hustle after they received notice.
- Sachin A Rosario
File a Complaint today and let our
experts help you in taking
legal action and getting resolution.